అందాల తార త్రిష వివాదంలో చిక్కుకుంది. దక్షణాదిలో త్రిష ఒకటిన్నర దశాబ్దానికి  పైగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. తన కెరీర్ పరంగా త్రిషకు ఎప్పుడూ బ్యాడ్ నేమ్ రాలేదు. తాజాగా త్రిషపై తమిళ నిర్మాత ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

త్రిష నటించిన 60వ చిత్రం 'పరమపదం విళైయాట్టు'. తిరుజ్ఞానం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. హీరోయిన్ సెంట్రిక్ గా సాగే ఈ చిత్తాని ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు. దీనితో చెన్నైలోని సత్యం థియేటర్ లో శనివారం ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు శివ త్రిషపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్లే సినిమా ప్రచారాలకు హాజరవుతున్నారు. కానీ హీరోయిన్లకు ఏమైంది.. హీరోయిన్లు కొందరు సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. సినిమా ప్రచారం కూడా నటీనటుల భాద్యతే అని శివ అన్నారు. 

'భీష్మ' డే 2 కలెక్షన్స్.. దూసుకుపోతున్న నితిన్ చిత్రం!

సినిమా ప్రచారంలో పాల్గొంటారనే స్టార్ హీరోయిన్లని నిర్మాతలు ఎంపిక చేసుకుంటున్నారు. ఇలా ప్రచారాలకు రాకుంటే హీరోయిన్లని బ్యాన్ చేస్తాం అని, కొత్తవారికి అవకాశం ఇస్తామని అన్నారు. త్రిష ఈ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్ రాకపోవడం బాధాకరం. ఆమెకు ఏదైనా విలువైన పని ఉండిఉండవచ్చు. ఈ చిత్రం 28న రిలీజ్ కానుంది. ఆలోపు అయినా ఆమె ప్రచారానికి హాజరు కావాలి. లేకుంటే రెమ్యునరేషన్ లో సంగం తిరిగి ఇచ్చేయాలి అని శివ వార్నింగ్ ఇచ్చారు. నిర్మాత వార్నింగ్ కు త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.