యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. మహా శివరాత్రి కానుకగా భీష్మ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి బజ్ తో విడుదలైన భీష్మ చిత్రానికి తొలి షో నుంచే హిట్ టాక్ మొదలయింది. దీనితో ప్రతి షోకు భీష్మ వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. 

తొలి రోజు భీష్మ చిత్రం నితిన్ కెరీర్ లోనే అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో 6.3 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్, ఇతర ప్రాంతాలతో కలుపుకుని ఈ చిత్రం 8 కోట్లకు పైగా తొలి రోజు రాబట్టింది. అంచనాలకు తగ్గట్లుగానే రెండవరోజు కూడా భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన పట్టు నిలుపుకుంది. 

రెండవ రోజు భీష్మ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 4.23 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో భీష్మ మూవీ తెలుగు రాష్ట్రాల షేర్ 10.52 కోట్లకు చేరింది. భీష్మ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 

నైజాం – 4.19 కోట్లు 

సీడెడ్ – 1.47 కోట్లు  

ఉత్తరాంధ్ర – 1.20 కోట్లు

తూర్పు గోదావరి – 0.92 కోట్లు

పశ్చిమ గోదావరి – 0.72 కోట్లు

కృష్ణా – 0.67 కోట్లు

గుంటూరు – 1.02 కోట్లు

నెల్లూరు – 0.37   కోట్లు

మొత్తం ఏపీ, తెలంగాణ 2డేస్ షేర్  – 10.52   కోట్లు

ఇదిలా ఉండగా భీష్మ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే దాదాపుగా అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 19 కోట్ల వరకు వసూలు చేయాలి. ఆదివారం రోజుకి ఈ చిత్రం 15 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. 

మీడియం రేంజ్ హీరోల ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్.. టాప్ లీగ్ కు వెళ్లే సత్తా ఎవరికుంది!

వెంకీ కుడుముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, రష్మిక జంటగా నటించారు. ఈ చిత్రం హాస్యం ప్రధాన బలంగా సాగుతుంది. వెన్నెల కిషోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలు థియేటర్స్ లో నవ్వులు పూయిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.