గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇటీవల లాస్ ఏంజిల్స్ లో జరిగిన గ్రామీ అవార్డుల కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం ఆమె స్పెషల్ గా డిజైన్ చేయించిన డ్రెస్ ని ధరించింది. ఈ డ్రెస్ లో ఆమె అందాలు ఆరోబోస్తూ కనిపించారు. బ్రెస్ట్ కనిపించేలా ఉన్న ఈ డ్రెస్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రియాంకని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రియాంక అలాంటి దుస్తులతో హాజరవడమేంటని ఆమెపై ఫైర్ అయ్యారు. అలానే ప్రముఖ డిజైనర్‌ వెండల్‌ రాడ్రిక్స్‌ సైతం ఆమె డ్రెస్‌ను విమర్శించాడు. కొన్ని రకాల బట్టలు ఏ వయసులో వేసుకోవాలో ఆ వయసులోనే వేసుకోవాలని ప్రియాంకకి సూచించాడు.

బ్రెస్ట్ కనపడేలా డ్రెస్.. వైరల్ అవుతోన్న ఫోటోలు, జనం తిట్లు

అతడు పెట్టిన ఈ పోస్ట్ విమర్శలపాలవ్వడంతో వెంటనే పోస్ట్ డిలీట్ చేసి.. తాను ప్రియాంక డ్రెస్ ని మాత్రమే విమర్శించానని.. ప్రియాంకని కాదని వివరణ ఇచ్చారు. తాజాగా ఈ డ్రెస్ పై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందించింది.

ప్రియాంక అవార్డుల ఫంక్షన్ లో ధరించిన గ్రామీ డ్రెస్ తనకు బాగా నచ్చిందని చెప్పారు. అంతేకాక.. ప్రియాంక డ్రెస్ పై వచ్చిన విమర్శలు తనను ఇంకా బలవంతురాలిని చేశాయంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రియాంక ముందే తనకు ఆ డ్రెస్ నమూనా చూపించిందని.. అయితే అప్పుడు దానిని క్యారీ చేయడం కష్టమేమో అనుకున్నట్లు.. కానీ ప్రియాంక దాన్ని అనుకున్నదానికంటే బాగా హ్యాండిల్ చేయగలిగిందని.. తాను ధరించే ఉత్తమమైన దుస్తుల్లో ఇదొకటి అంటూ చెప్పుకొచ్చారు.