యంగ్ హీరో నితిన్ పై కరోనా ప్రభావం బాగానే పడింది. భీష్మ విజయంతో జోరుమీదున్న నితిన్ ఏప్రిల్ లో తన ప్రేయసితో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు. కరోనా లేకుంటే ఈ పాటికి నితిన్ ఓ ఇంటివాడయ్యే వాడు. కానీ ఇంతలో కరోనా వచ్చి జనజీవితాలని అతలాకుతలం చేసింది. దీనితో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. 

నితిన్ గత కొన్నేళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నితిన్ పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ బాలీవుడ్ సూపర్ హిట్ అంధాదున్ రీమేక్ లో నటించాల్సి ఉంది. 

హిందీలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించాడు. రాధికా ఆప్టే హీరోయిన్. ఇక సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో నటించింది. టబు రోల్ కోసం తెలుగులో అనసూయ, రమ్యకృష్ణ లాంటి నటుల పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక హీరోయిన్ పాత్రలో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. 

ఇంటికొచ్చి మరీ తంతా, నేనింకా యంగే.. లైవ్ లో హేమని ముద్దు అడిగిన నెటిజన్

గ్యాంగ్ లీడర్ మూవీలో నానితో ప్రియాంక అరుల్ రొమాన్స్ చేసింది. ఆ చిత్రంలో ప్రియాంక అరుల్ ఎక్కడా అందాలు ఆరబోయలేదు. పద్దతిగా నటించింది. ఆమె క్యూట్ లుక్స్ యువతని ఆకర్షించాయి. అలాంటి ప్రియాంక నితిన్ తో కలసి బోల్డ్ సీన్స్ లో నటించేందుకు రెడీ అవుతోంది అంటూ టాక్. హిందీలో ఆయుష్మాన్, రాధికా ఆప్టే మధ్య వేడెక్కించే సన్నివేశాలు ఉంటాయి. ఆ సీన్స్ ని తెలుగు రీమేక్ లో నితిన్, ప్రియాంక మధ్య రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

మరి గ్యాంగ్ లీడర్ లో పద్దతిగా కనిపించిన ప్రియాంక.. నితిన్ తో ఘాటు రొమాన్స్ కు ఒప్పుకుందా అనేది ప్రశ్న. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు.