ప్రవీణ్ సత్తారు లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో మహేష్ బాబు సినిమా చేస్తారా..? అనే సందేహాలు కలగొచ్చు కానీ వినిపిస్తున్న విషయం ఏంటంటే.. ప్రవీణ్ సత్తారు చెప్పిన ఓ కథను మహేష్ ఎనభై శాత ఓకే చేశారట.

ప్రస్తుతం ఈ సినిమా పరిశీలనలో ఉందని సమాచారం. ప్రవీణ్ సత్తారు గతంలో 'చందమామ కథలు', 'గుంటూరు టాకీస్' వంటి సినిమాలు తీశారు. 'గరుడవేగ' సినిమా తీసి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. రాజశేఖర్ తో ఆ రేంజ్ సినిమా ఆ మాత్రం గొప్పగా తీయడం మామూలు విషయం కాదు.

శ్రీదేవి వర్థంతి.. జాన్వీ ఎమోషనల్ పోస్ట్!

బహుశా ఇది గమనించారో.. లేదా ప్రవీణ్ చెప్పిన కథ నచ్చో మహేష్ ఒక ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు. ప్రవీణ్ చెప్పిన కథ చాలా వరకు ఓకే అయిందని.. కొన్ని డిస్కషన్లు, కొన్ని మార్పులు చేర్పులు స్టేజ్ లో ఈ ప్రాజెక్ట్ ఉందని తెలుస్తోంది.

మహేష్ భార్య నమ్రత కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్ దగ్గర సరైన కథ అయితే లేదు. వంశీ పైడిపల్లి చెప్పిన కథను కూడా పక్కన పెట్టేశాడు. ప్రవీణ్ సత్తారు గనుక సరైన కథ చెప్పి మహేష్ ని ఒప్పించగలిగితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు.