'అతిలోకసుందరి' శ్రీదేవి మరణించి నేటికి రెండేళ్లు గడుస్తోంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో మునిగి చనిపోయారు. ఇప్పటికీ శ్రీదేవి కుటుంబసభ్యులు ఆమెని తలచుకుంటూ ఎమోషనల్ అవుతూనే ఉంటారు.

ఈరోజు శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన చిన్నప్పుడు తల్లితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేస్తూ.. 'రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను' అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ పై పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

ధైర్యంగా ఉండాలని జాన్విని కోరుతున్నారు. అభిమానులు కూడా శ్రీదేవిని తలుచుకుంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నారు. గతేడాది శ్రీదేవి వర్థంతి రోజున బోనీకపూర్ కుటుంబం ఘనంగా సేవా కార్యక్రమాలు చేపట్టింది. శ్రీదేవికి ఇష్టమైన చీరను వేలం వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుని సేవా కార్యక్రమానికి ఉపయోగించారు.  


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Miss you everyday

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Feb 23, 2020 at 12:02pm PST