వరుస అపజయాల అనంతరం ఈ ఏడాది చిత్రలహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. సాయి తేజ్ అని పేరు మార్చుకున్నప్పటి నుంచి ఈ మెగా మేనల్లుడికి అన్ని కలిసొస్తున్నట్టున్నాయి. చిత్రలహరి కమర్షియల్ గా పెద్దగా లాభాల్ని అందించలేకపోయినప్పటికి సినిమా మాత్రం చాలా మంది మనసులను తాకింది. దీంతో సాయి ఎదో విధంగా హిట్ అయితే అందుకున్నాడు.

ఇకపోతే నెక్స్ట్ సాలిడ్ గా కమర్షియల్ సక్సెస్ అందుకునేందుకు ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ తో రెడీ అయ్యాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రతి రోజు పండగే' సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలకృష్ణ రూలర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాడు. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

also read గాయపడిన బాక్స్ ఆఫీస్ సింహాలు.. ఆశలన్నీ 2020పైనే..

యూవీ క్రియేషన్స్ - గీత ఆర్ట్స్ సంస్థల నుంచి రాబోతున్న సినిమా కావడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ ఎవరనేది అందరిలో హాట్ టాపిక్ గా మారింది. డిసెంబర్ 15న హైదరాబాద్ మాదాపూర్ ఐటీసీ కోహినూర్ వేదికగా సాయంత్రం 6గంటలకు ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. యూవీ క్రియేషన్స్ ప్రభాస్ సర్కిల్ లోదే కావడం.. అలాగే గీతా ఆర్ట్స్ మెగా, అల్లు వారిదవ్వడంతో సినిమా బిజినెస్ కి ఏ మాత్రం డోకా లేదు. సినిమా అయితే గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

 

క్రిస్మస్ సెలవులు కూడా సినిమా కలెక్షన్స్ కి బూస్ట్ ఇవ్వనున్నాయి. అయితే ప్రతిరోజు పండగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోయే స్పెషల్ గెస్ట్ ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కచ్చితంగా ఒక స్పెషల్ గెస్ట్ ఆడియెన్స్ కిక్కిచ్చే ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించగా థమన్ మ్యూజిక్ అందించారు.