చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీమణులు కేవలం సినిమాలని మాత్రమే  నమ్ముకోవడం లేదు. సినిమా అవకాశాలు శాశ్వతం కాదు. కాబట్టి చాలా మంది నటీమణులు ముందు జాగ్రత్త చర్యలుగా ఫామ్ లో ఉన్నప్పుడే వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా, కాజల్, అనుష్క శర్మ లాంటి నటీమణులంతా వ్యాపారాల్లో రాణిస్తున్నారు. 

కొంతకాలం వ్యాపారం చేశాక ఆ బిజినెస్ నుంచి కాజల్, తమన్నా లాంటి హీరోయిన్లు తప్పుకున్నారు. గతంలో తమన్నా, కాజల్ జ్యువెలరీ బిజినెస్ లో భాగస్వాములుగా ఉన్నారు. ఇక టాలీవుడ్ లో అత్తారింటికి దారేది చిత్రంతో బాపు బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత సుభాష్ కూడా వ్యాపారంలో రాణిస్తోంది. 

2015లో ప్రణీత బెంగుళూరులో పబ్ బిజినెస్ లో భాగస్వామి అయింది. బూట్ లెగ్గర్ అనే పబ్ లో ప్రణీత భాగస్వామి. ప్రస్తుతం ప్రణీత ఆ బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. త్వరలో కొత్త వ్యాపారం ప్రారంభించే ఉద్దేశంలో తాను ఉన్నట్లు ప్రణీత చెప్పుకొచ్చింది. 

ఫేక్ న్యూస్ పై ముందే మాట్లాడా.. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు

వ్యాపారాల వల్లే తాను బతకడం లేదని.. కాకపోతే బిజినెస్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచే ఉండేదని ప్రణీత తెలిపింది. తన సంతృప్తి కోసమే బిజినెస్ చేస్తున్నట్లు ప్రణీత చెబుతోంది. తెలుగులో ప్రణీత అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం ప్రణీత కరోనా క్రైసిస్ సమయంలో ప్రణీత భారీగా విరాళాలు, పేదలకు భోజనం అందిస్తూ అందరి మన్ననలు పొందుతోంది.