ప్రముఖ నటుడు నందు, గాయని గీతా మాధురి టాలీవుడ్ లో సెలెబ్రిటీ కపుల్స్. ఇటీవల ఈ జంటకు ఓ పాప జన్మించింది. ప్రస్తుతం గీతా మాధురి, నందు  అన్యోన్యంగా జీవిస్తున్నారు. తాజాగా నందు, గీతా మాధురి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలని నందు, గీతా మాధురి పంచుకున్నారు.

గీతా మాధురి నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొంది. గీతా మాధురి బిగ్ బాస్ లో పాల్గొనడంపై నందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గీతా మాధురి గాయనిగా అందరికీ తెలుసు. కానీ ఒక వ్యక్తిగా ఆమె గురించి బయటవారికి తెలియదు. 

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం గీతా మాధురిది. ఇలా మాట్లాడితే బిగ్ బాస్ హౌస్ లో ఇబ్బంది పడుతుందని ముందే తెలుసు. నేను అనుకున్నట్లుగానే ఆరంభంలో అలానే జరిగింది. అందరూ ఒకలా ఆలోచిస్తే గీత మాత్రం భిన్నంగా ఆలోచించేది. 

చిరంజీవి గారి గురించి తెలుసుకున్నా, శ్రీజకు ఫోన్ చేశా.. వెన్నుపోటు పొడిచాడు

దీనివల్ల గీతపై సోషల్ మీడియాలో కూడా పలు కామెంట్స్ వినిపించాయి. ఆమెని అంతా అపార్థం అని నందు తెలిపాడు. మొదట గీతని విమర్శించినవారే చివరకు అర్థం చేసుకున్నారని నందు తెలిపాడు. 

గీతా మాధురి మాట్లాడుతూ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చ జరుగుతున్న ఫేక్ న్యూస్ పై స్పందించింది. ఫేక్ న్యూస్ వల్ల మేము కూడా ఇబ్బంది పడ్డాం. ఫేక్ న్యూస్ గురించి గతంలోనే మేము స్పందించాం. కానీ మాకు ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. 

ఇప్పుడు మంచి గుర్తింపు ఉన్న విజయ్ దేవరకొండ ఫేక్ న్యూస్ పై పోరాటం చేయడం, అందుకు ప్రముఖులంతా మద్దతు తెలపడం సంతోషించదగ్గ అంశం అని గీతా మాధురి తెలిపింది. సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చాలా దారుణమైన థంబ్ నైల్స్ ఉంటాయని, కానీ లోపల విషయం ఏమీ ఉండదని గీతా మాధురి ఆరోపించింది.