Asianet News TeluguAsianet News Telugu

పవన్ రూట్ లోనే ప్రభాస్.. ఫలితం బాగుందట!

ఇదే విధానాన్ని ప్రభాస్ సైతం అనుసరిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఎంతో బడ్జెట్ పెట్టి చేస్తున్న తన తాజా చిత్రం విషయంలో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. 

Prabhas's Strict Decision on Leaks like Pawan!
Author
Hyderabad, First Published Jan 25, 2020, 9:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్ గా లేకపోతే రకరకాల ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా భారీ సినిమాల నిర్మాణాల సమయంలో లీక్ ల బెదడ ను ఆపాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. తాజాగా పవన్ కళ్యాణ్  తన పింక్ రీమేక్ సినిమా విషయంలో అలాంటి జాగ్రత్తలు తీసుకోమని నిర్మాత దిల్ రాజు ని ఆదేశించినట్లు సమాచారం. పింక్ రీమేక్ ఆన్ లొకేషన్ పిక్స్ బయిటకు రావటంతో పవన్ చాలా సీరియస్ అయ్యినట్లు చెప్తున్నారు. మరోసారి అలాంటి పొరపాటు జరగటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో దర్శకుడు దగ్గర నుంచి హీరోయిన్ దాకా ఎవరి దగ్గరా సెల్ ఫోన్ అనేది లేకుండా షూట్ చేస్తున్నారట.

ఇక ఇదే విధానాన్ని ప్రభాస్ సైతం అనుసరిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఎంతో బడ్జెట్ పెట్టి చేస్తున్న తన తాజా చిత్రం విషయంలో ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు తనతో సహా ఎవరూ సెల్ ఫోన్స్ సెట్స్ లో వాడకూడదని అన్నారట. కేవలం సినిమా టీమ్ నుంచి అఫీషియల్ గా వచ్చే ఫొటోగ్రాఫర్ తప్ప వేరే వారు ఫొటోలు తీయకూడదని చెప్పారట. ఈ నిర్ణయం టాప్ హీరోయిన్ పూజాహెగ్డే నుంచి బాలీవుడ్ మాజీ హీరోయిన్ భాగ్యశ్రీ దాకా వర్తిస్తుందని చెప్పారట. అలాగే తన అనుమతి లేనిదే చిన్న ఫొటో కూడా మీడియాకు వెళ్లటానికి వీల్లేదని చెప్పారట.

మెగాస్టార్ 'సైరా'కు దెబ్బ పడింది.. కారణం అదే అంటున్నారు!

దాంతో ప్రతీ రోజు షూటింగ్ మొదలు కావటానికి ముందే సెల్ ఫోన్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారట. లీక్ లు బెడద ఎక్కువైన నేపధ్యంలో ఎవరూ కూడా ఈ డెసిషన్ కు అడ్డు తగలటం లేదట. దాంతో కేవలం ఫొటో లీక్ లు ఆపటమే కాక..అనవసరంగా ఫోన్స్ మాట్లాడుతూ..టైమ్ వేస్ట్ చేసే బ్యాచ్ కూడా తగ్గుతారని, దానివల్ల అందరి దృష్టి తాము చేస్తున్న సినిమాపైనే ఉంటుందని నిర్మాత,హీరో సంతోషపడుతున్నారట.  

బిల్లా తర్వాత ప్రభాస్ హీరోగా గోపికృష్ణా మూవీస్ నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ఇంటర్నేషనల్ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని గ్రాండియర్ ప్రొడక్షన్స్ వేల్యూస్‌తో నిర్మించనున్నారు. టెక్నీకల్‌గా హై స్టాండర్డ్స్‌తో ఈ చిత్రం ఉండనుంది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు.

స్టైలిష్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస... ప్రొడక్షన్ డిజైనింగ్‌ కు రవీందర్.. ప్రముఖ ఎడిటర్ హిట్స్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్ వంటి సీనియర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించబోయే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే విధంగా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది.  ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios