బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమాతో దాన్ని నెలబెట్టుకోలేకపోయారు. అయినా ఆయనకు ఉన్న క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. దాంతో యంగ్ రెబల్ స్టార్ తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అందరూ ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రభాస్, నిర్మాతలతో కూర్చుని రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అదెప్పుడంటే..

'జిల్' దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ నిర్మించారు. పస్ట్ షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఇప్పటికే మొదలు కావాల్సి ఉండగా, ప్రభాస్ హాలిడే ట్రిప్ వల్ల అది జనవరి నెలాఖరుకు వెళ్ళింది. దాంతో సాహోలా ఈ చిత్రం రిలీజ్ లేట్ కాకడదని, ఎలాగైనా  పూర్తి చేసి 2020 దసరాకి మన ముందుకు తీసుకురావాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. దసరా శెలవలు ప్రారంభం నాడే  అంటే దసరా ఓ పది రోజులు ఉందనగా రిలీజ్ అయ్యే అవకాసం ఉంది.  ఈ మేరకు ప్లానింగ్ జరుగుతోంది. రిలీజ్ డేట్ అతి త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే థియోటర్స్ అందుబాటులో ఉండాలంటే ముందుగా పెద్ద సినిమా రిలీజ్ డేట్ చెప్పాల్సిన అవసరం ఉంది.

హీరో రాజశేఖర్ కి మరో షాక్.. డ్రైవింగ్ చేస్తే జైలుకే!

అందుతున్న సమాచారం బట్టి ఈ చిత్రాన్ని జాతకాలు,  పునర్జన్మ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో 1970లల్లో పూజ వయోలిన్ టీచర్ గా, ప్రభాస్ దొంగగా వారి కథ యూరప్ లో స్టార్ట్ ప్రారంభం కానుందిట.అప్పుడు సక్సెస్ కానీ ఆ లవ్ స్టోరీ.. పునర్జన్మ ఎత్తాక ఒకటవుతారట. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒక లుక్ లో గడ్డం మీసాలతో ఉంటే, రెండవ లుక్ లో క్లీన్ గా షేవ్ చేసుకుని కనిపించనున్నాడంటున్నారు.

ఇక ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.