పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రంగా రాబోతున్న వకీల్ సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న వకీల్ సాబ్ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. చాలా రోజుల తర్వాత పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. పవన్ తనదైన  నేచురల్ స్టైల్ లో పడుకుని పుస్తకం చదువుతున్న లుక్ ఆకట్టుకుంది. 

ఎన్టీఆర్, రాంచరణ్ తో ఢీ.. అది పిచ్చి పనే.. హీరో యష్ కామెంట్స్!

తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ అందించింది. మార్చి 8, ఉదయం 10 గంటలకు 'మగువా మగువా' అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. శాంపిల్ గా సాంగ్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. 28 సెకండ్లు ఉన్న సాంగ్ ప్రోమో సింపుల్ గా ఉంటూ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. మహిళల గొప్ప తనాన్ని వర్ణించేలా ఈ పాట ఉండబోతోంది. 

సాంగ్ ప్రోమో చూస్తుంటే సంగీత దర్శకుడు తమన్, గాయకుడు సిద్ శ్రీరామ్ ల మ్యాజిక్ రిపీట్ అయ్యేలా ఉంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో సిద్ శ్రీరామ్ పాడిన సామజవరగమన సాంగ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మగువా మగువా సాంగ్ కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. అంజలి, నివేత థామస్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంగ్ ప్రోమోపై ఓ లుక్కేయండి..