బాక్సాఫీస్ ని ఊపేయడానికి రెండు భారీ సౌత్ ఇండియన్ చిత్రాలు రెడీ అవుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఆ చిత్రాల కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ రెండు చిత్రాలు ఏవో ఈపాటికే మీరు గ్రహించి ఉండాలి.. అవే RRR, KGF2. ముందుగా కెజిఎఫ్ 2 చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది. 

రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం కోసం యావత్ దేశంతో పాటు విదేశాల్లో ఉన్న అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కూడా జులైలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఆలస్యమవుతుండడంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. 

అప్పటి వరకు కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొనబోతున్నాయంటూ ప్రచారం జరిగింది. దీనిపై హీరో యష్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రెండు చిత్రాలు ఒకేసారి విడుదల కావని తేల్చి చెప్పాడు. ఆర్ఆర్ఆర్ ని ఢీ కొట్టడం పిచ్చి పనే అవుతుంది. అలాంటి పని మేం చేయబోము. 

ఆర్ఆర్ఆర్ టీంతో మేము తరచుగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ముందుగా ఆర్ఆర్ఆర్ చిత్రం జులైలో రిలీజ్ కావాలని భావించినప్పుడు మాతో చెప్పారు. కెజిఎఫ్ చిత్ర రిలీజ్ డేట్ మార్చాలని కోరారు. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ సంక్రాంతికి మారిపోయింది. ఆ విషయాన్ని కూడా ఆర్ఆర్ఆర్ టీం ముందుగా మాకు తెలియజేసింది. దీనితో మా చిత్ర రిలీజ్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం అని యష్ తెలిపాడు. 

ప్రగతి, పవిత్రని ఏకిపారేసిన నటి సుధ.. మహేష్ సినిమానే రిజెక్ట్ చేశా

ఇక హిందీలో ఈ రెండు చిత్రాలని హిందీలో అనిల్ తడానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని, కాబట్టి రిలీజ్ సమస్యలు ఉండవని యష్ తేల్చి చెప్పాడు. కెజిఎఫ్ చిత్రం భారీ విజయం సాధించడం తో ఇప్పుడు పార్ట్ 2 పై కానివినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.