ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. ప్రస్తుతం సుశీంద్రన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 'వెన్నెలా కబడ్డీ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుశీంద్రన్ మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్నాడు.

ఈ సినిమా సక్సెస్ తో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. విశాల్, కార్తీ వంటి పలువురు హీరోలతో సినిమాలు చేశారు. సుశీంద్రన్ డైరెక్ట్ చేసిన 'కెనడీ క్లబ్', 'ఛాంపియన్' సినిమాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సుశీంద్రన్ కి రోజూ ఉదయాన్నే వాకింగ్, వ్యాయామాలు చేయడం అలవాటు.

ఆ హీరో బెడ్ పై ఉంటే ఏం చేస్తావ్..? నటికి షాకింగ్ ప్రశ్న!

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఆయన వాకింగ్ కి వెళ్తుండగా.. బైక్ లో వచ్చిన వ్యక్తి సుశీంద్రన్‌ ని ఢీకొట్టారు. దీంతో కింద పడిన సుశీంద్రన్‌ కి తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక విరిగింది. దీంతో ఆయన్ని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. గాయాలు తీవ్రం కావడంతో కొన్ని రోజుల పాటు ఆయన హాస్పిటల్ లోనే ఉండాలని డాక్టర్లు సూచించారు.