సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కోసారి మన తారలకు ఎదురయ్యే ప్రశ్నలు వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి ఓ పరిస్థితి ఒకప్పటి బాలీవుడ్ నటి పూజా బేడీ కూతురు అలాయాకు ఎదురైంది.

ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జావనీ జానేమన్' అనే సినిమాలో అలాయా.. సైఫ్ కూతురి పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలాయా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలు అలాయాకి యాంకర్ నుండి అసభ్యకరమైన ప్రశ్న ఎదురైంది.

ఎన్టీఆర్, ప్రభాస్ తో ఊపేసింది.. ఆమె కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువే!

'మీరు ఉదయం లేవగానే మీ బెడ్ పై హీరో కార్తిక్ ఆర్యన్ ఉంటే ఏం చేస్తారు..?' అని యాంకర్ ప్రశ్నించగా.. అలాయా షాక్ అయింది. ఆ తరువాత తనదైన స్టైల్ లో సమాధానమిచ్చింది. 'నేనేం అనుకోను.. అందులో సర్ప్రైజ్ అవ్వాల్సింది ఏముంది..?' అని అన్నారు. తన సమాధానాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటారేమోనని క్లారిటీ కూడా ఇచ్చింది.

'నా ఉద్దేశంలో ఎలాంటి తప్పుడు ఆలోచన లేదు. మీరు అడిగారు కాబట్టి సమాధానం చెప్పాను' అంటూ వెల్లడించింది. ఎవరితోనైనా రిలేషన్ లో ఉన్నారా అని ప్రశ్నించగా.. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నట్లు చెప్పింది. తనకు తెలిసి తనతో ఎవరూ ప్రేమలో పడలేదని.. తను కేవలం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పింది.

తను పూజా బేడీ కూతురు అయినప్పటికీ సినిమా ఛాన్స్ అంత ఈజీగా రాలేదని చెప్పింది. చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చానని.. కానీ ఎందులో సెలెక్ట్ కాలేదని.. కాస్త లేట్ అయినా.. తనకు మంచి సినిమా దొరికిందని చెప్పుకొచ్చింది. నితిన్ కక్కర్ డైరెక్ట్ చేసిన 'జవానీ జానేమన్' సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.