ప్రపంచ మొత్తం కరోనా వైరస్ కారణంగా చిగురుటాకులా వణుకుతోంది. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇండియా లాంటి ప్రధాన దేశాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఇండియాలో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినప్పటికీ రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 

దీనితో సెలెబ్రిటీలు తమకు తోచిన విధంగా ప్రజల్లో కరోనాపై అవేర్నెస్ పెంచుతున్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. తమిళ నటుడు, ప్రముఖ లిరిసిస్ట్, జానపద గాయకుడు అయిన పుష్పవనం కుప్పుస్వామి కుమార్తె పల్లవి సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేసింది. 

షాకింగ్ ట్విస్ట్: 'V'లో విలన్ నాని కాదా.. హీరోయిన్ పై రూమర్స్!

పల్లవి డాక్టర్ గా సేవలందిస్తోంది. పల్లవి  ఫేస్ బుక్ లో ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ.. స్టే హోమ్.. స్టే సేఫ్.. ప్రేమని పొందండి.. పిల్లల్ని కాదు.. ఆసుపత్రుల్లో గర్భవతుల తాకిడి ఎక్కువవుతోంది అంటూ పల్లవి పోస్ట్ చేసింది. 

కరోనా క్రైసిస్ సమయంలో డాక్టర్లు కరోనా పేషంట్ తో బిజీగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో రొమాన్స్ తగ్గించుకోవాలని పల్లవి ఇలా సెటైరికల్ గా చెప్పారు.