టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన పూనమ్ ఆ తరువాత అవకాశాలు లేక కనుమరుగైంది. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది. త్వరలోనే ఈ బ్యూటీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని కలవబోతోందట.

విషయమేమిటంటే.. నవంబర్ 12న గురునానక్ 550వ జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ కర్తార్ పూర్ కారిడర్ ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కారిడర్ పాకిస్తాన్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ ని పంజాబ్‌లోని డేరా బాబా నానక్ గురుద్వారాకు కనెక్ట్ అయి ఉంటుంది.

Thippara Meesam Review: శ్రీ విష్ణు `తిప్పరా మీసం` రివ్యూ ...

దీని రెండు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. మోదీ చేపడుతున్న ఈ కారిడర్ ఆవిష్కరణ కార్యక్రమానికి పాక్ తరఫున ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ హాజరుకానున్నారు. ఈ వేడుకకు ఇమ్రాన్ సినీ నటి పూనమ్ ని కూడా ఆహ్వానించారట. ఈ విషయాన్ని పూనమ్ స్వయంగా వెల్లడించింది. కర్తార్ పూర్ కారిడర్ ఆవిష్కరణకి పాక్ తరఫున తనకు ఇన్విటేషన్ అందిందని.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీసా పనులు చూసుకుంటున్నానని చెప్పింది.

ఇది సిక్కులు గర్వపడే విషయమని.. ఎంతో ఎమోషనల్ అవుతున్నట్లు చెప్పింది పూనమ్. తనకు అవకాశం వస్తే ఇమ్రాన్ ఖాన్ ని కలవాలనుకుంటున్నట్లు చెప్పింది. తనకు ఈ అవకాశం ఎలా వచ్చిందో చెబుతూ కొన్ని విషయాలను వెల్లడించింది. 1947 విభజన జరిగిన తరువాత దర్బార్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లిన మొదటి మహిళగా పూనమ్ పేరు తెచ్చుకుంది.

ఆ సమయంలో ఆమె వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ విధంగా తన గురించి పాక్ ప్రధానికి తెలిసిందని.. అందుకే తనను కారిడర్ ఆవిష్కరణకు పిలిచారని వెల్లడించింది.  గతేడాదిలో పాకిస్థాన్ ప్రభుత్వం తనకు అవార్డు ఇవ్వాలనుకుందని కానీ పుల్వామా దాడులు జరుగుతున్న కారణంగా వెళ్లలేకపోయానని తెలిపింది.