చైనా గడ్డపై పుట్టుకొచ్చిన రాకాసి కరోనా ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. చిన్న దేశం, పెద్ద దేశంఅని తేడా లేకుండా ప్రపంచ దేశాలలో కరోనా చాపకింద నీరులా పాకుతోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశాల అధినేతలంతా తలలు పట్టుకుంటున్నారు.

ఇండియాలో ఎక్కువగా ఈ వైరస్ విదేశాల నుంచి వచ్చిన వారివల్లే సోకుతోంది. దీనితో ఇటీవల కాలంలో విదుదల నుంచి తిరిగివచ్చిన వారంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం పలుమార్లు ప్రకటన చేసింది. కానీ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మాత్రం ఇతరుల ఆరోగ్యాన్ని, ప్రాణాలని లెక్క చేయకుండా లండన్ నుంచి రాగానే పార్టీలు, పబ్బుల వెంట తిరిగింది. ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడానికి ముందు వరకు దాదాపు 400 మందితోపార్టీలో పాల్గొన్నట్లు టాక్. 

కరోనా ఎఫెక్ట్: పట్టుపట్టిన వధువు, వరుడు.. తన ఇంట్లోనే పెళ్లి జరిపించిన హీరో

దీనితో సోషల్ మీడియాలో ఆమెని దుమ్మెత్తిపోస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కనికా కపూర్ పై ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ట్వీట్ చేసింది. 'భాద్యత  మనం చేసుకునే ఎంపిక. కానీ సుఖాలని విడిచిపెట్టలేని కొందరు బాధ్యతలని స్వీకరించరు. అందుకు కారణం తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడం, సమాజంలో పలుకుపడి, డబ్బు. డబ్బు, పవర్ ఎక్కువగా ఉంటె దానర్థం ఎక్కువ భాద్యతగా ఉండాలని. కనికా కపూర్ క్రిమినల్' అంటూ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. 

ప్రస్తుతం కనికా కపూర్ కరోనా సోకడంతో చికిత్స తీసుకుంటోంది. బేబీ డాల్ సాంగ్ తో కనికా కపూర్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

అనసూయ హాట్ లుక్స్.. నడుము అందాలతో సెక్సీగా..