తమిళ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ గురించి పరిచయం అవసరం లేదు. సేవా భావం ఉన్న నాయకుల్లో విజయకాంత్ కూడా ఒకరు. విజయకాంత్ హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 

తండ్రికి గుర్తుగా ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడంటే..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా జనజీవనం స్తంభించే పరిస్థితులు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో కరోనా వైరస్ ని అదుపు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నేడు(ఆదివారం మార్చి 22న) రోజు దేశప్రజలంతా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అన్ని నగరాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. 

రాజమౌళి నుంచి మారుతి వరకు.. వీళ్లంతా మామూలోళ్లు కాదుగా.. ఈ రికార్డ్స్ చూడండి

ప్రజలు తమ కార్యక్రమాలన్నింటిని రద్దు చేసుకున్నారు. ఇదిలా ఉండగా విజయకాంత్ మాత్రం తన ఇంట్లోనే ఓ వివాహ వేడుకని జరిపించారు. జనాలు గుంపుగా చేరితే కరోనా ఎక్కువయ్యే ప్రమాదం ఉండడంతో.. పెళ్ళిళ్ళు ఇతర కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వాలు సూచించాయి. 

కానీ విజయకాంత్ మాత్రం తన ఇంట్లోని ఓ జంటకు వివాహం జరిపించారు. తన పార్టీకి చెందిన ఓ కీలక వ్యక్తి కుమారుడి పెళ్లి కొన్ని నెలల క్రితమే నిశ్చయమైంది. ముహూర్తం ప్రకారం ఈరోజే వారి పెళ్లి. వధువు, వరుడు తప్పనిసరిగా విజయకాంత్ హాజరుకావాల్సిందేనని పట్టుబట్టారట. కానీ ఓ వైపు కర్ఫ్యూ జరుగుతోంది.. వైద్యులు కూడా బయటకు వెళ్లోద్దని విజయకాంత్ కు సూచించారట. 

అరవింద్ ఆలోచనకు అవాక్కైన డైరక్టర్

దీనితో విజయ్ కాంత్ వధువు, వరుడు లని తన ఇంటికే పిలిపించుకుని వివాహం జరిపించారు. అది కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించుకుని.. ఈ వేడుకలో కేవలం 10 మంది మాత్రమే పాల్గొన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.