టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ అతడిని టార్గెట్ చేసే వారి లిస్ట్ లో నటి పూనమ్ కౌర్ ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పవన్ ని ఉద్దేశిస్తూ తరచూ పరోక్షంగా కామెంట్స్ చేస్తుంటుంది పూనమ్.

ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఆమెని ఎంతగా టార్గెట్ చేసినా.. పూనమ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవలే పవన్ ఉద్దేశిస్తూ.. 'ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడేమో కానీ లీడర్ మాత్రం కాలేడు' అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ పవన్ ని ఉద్దేశించినట్లుగానే ఉందని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని చెప్పడంతో.. పవన్ ఫ్యాన్స్ పూనమ్ పై విరుచుకుపడ్డారు.

''పూనమ్ గోడ మీద పిల్లి'' నటి శ్రీరెడ్డి ఫైర్!

ఈ విషయంలో ఆమెకి వార్నింగ్ లు కూడా వెళ్లాయి. కానీ పూనమ్ మాత్రం వెనక్కి తగ్గకుండా తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ఈసారి 'యాంగర్ ఈజ్ నాట్ పవర్' అని రాసుకొచ్చింది. అంటే.. కోపమనేది శక్తి కాదూ అని అర్ధం.. కాస్త లోతుగా పరిశీలిస్తే దీనికి చాలానే  అర్ధాలు తీసుకోవచ్చు.

ఆదివారం నాడు పవన్ కళ్యాణ్ విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ చేపట్టాడు. ఇసుక కొరత కారణంగా నాలుగు నెలలుగా సమస్యలు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా పవన్ ఈ మార్చ్ చేపట్టాడు. ఇది పూర్తయిన తరువాత పవన్ బహిరంగ సభలో స్పీచ్ ఇచ్చారు. ఎప్పటిలానే కోపంతో రగిలిపోతూ.. గవర్నమెంట్ కి ఈ విషయంలో డెడ్ లైన్ పెట్టారు.

ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పూనమ్ ట్వీట్ పెట్టినట్లు ఉంది. ఈ ట్వీట్ చూసిన పవన్ అభిమానులు పూనమ్ పై మండిపడుతున్నారు. ధైర్యం ఉంటే పేరు మెన్షన్ చెయ్  అంటూ సవాలు విసురుతున్నారు. ఈ పోస్ట్ పెట్టడానికి ఎంత డబ్బు తీసుకున్నావ్..? అంటూ మరికొంతమంది పూనమ్ ని టార్గెట్ చేస్తున్నారు. పవన్ హేటర్స్ మాత్రం పూనమ్ కి సపోర్ట్ చేస్తున్నారు.