విశ్వనటుడు కమల్ హాసన్ తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. కమల్ ని ఎప్పుడూ వివాదాలు వెంటాడుతోనే ఉంటాయి. రాజకీయంగా కమల్ హాసన్ చేసే కామెంట్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్నారు. 

ఇక కమల్ హాసన్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. కమల్ హాసన్ కు పెళ్లి కలసి రాలేదు. తన తొలి భార్య వాణి గణపతి నుంచి కమల్ 1998లో విడిపోయారు. ఆ తరువాత నటి సారికని వివాహం చేసుకున్నారు. శృతి హాసన్, అక్షర పుట్టాక సారిక నుంచి కూడా కమల్ విడిపోయారు. 

లూసిఫర్ రీమేక్ లో చిరంజీవితో విజయశాంతి.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..

ఆ తర్వాత కమల్ మరో నటి గౌతమితో సహజీవనం చేయడం ఆమె నుంచి కూడా మూడేళ్ళ క్రితం విడిపోవడం తెలిసిందే. ప్రస్తుతం కమల్ హాసన్ విశ్వరూపం హీరోయిన్ పూజా కుమార్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 

పూజా కుమార్ తరచుగా కమల్ హాసన్ ఫ్యామిలీ ఫంక్షన్ లకు హాజరు అవుతుండడం.. వారి కుటుంబ సభ్యురాలిగా మెలుగుతుండడంతో ఈ వార్తలు వస్తున్నాయి. దీనిపై పూజా కుమార్ తాజాగా స్పందించింది. తనకు కమల్ హాసన్ కుటుంబ సభ్యులు చాలా కాలం నుంచి తెలుసు అని తెలిపింది. కమల్ హాసన్ సోదరుడు, ఆయన కుమర్తెలతో కూడా నాకు పరిచయం ఉంది. అందుకే వారి కుటుంబ వేడుకలకు నేను కూడా హాజరవుతుంటా అని  పూజా కుమార్ చెప్పుకొచ్చింది. కమల్ తో రిలేషన్ గురించి మాత్రం నేరుగా స్పందించలేదు.