మెగాస్టార్ చిరంజీవి ఇక వరుస చిత్రాలతో బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే. తన తదుపరి చిత్రాల కోసం చిరంజీవి ఎక్కువగా యువ దర్శకులని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత చిరు లూసిఫెర్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. 

లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయి. సాహో ఫేమ్ సుజీత్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మలయాళంలో లూసిఫెర్ చిత్రం అఖండ విజయం సాధించింది. 

ఈ చిత్రంలో హీరో సోదరిగా కీలక పాత్ర ఉంది. మలయాళంలో ఆ పాత్రలో క్రేజీ బ్యూటీ మంజు వారియర్ నటించారు. తెలుగులో చిరంజీవి సోదరిగా విజయశాంతి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ న్యూస్ వినగానే అభిమానులు షాక్ కావడం సహజమే. కేవలం సోదరి పాత్ర మాత్రమే అయితే విజయశాంతి లాంటి లేడి సూపర్ స్టార్ పేరు వినిపించదు. 

చాలా చూశా.. ఐటీ కంపెనీల్లో సెక్స్, హీరోయిన్లు ఒప్పుకుంటేనే.. నందిని రాయ్ హాట్ కామెంట్స్

ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. పొగరుగా వ్యవహరించడం, తమ్ముడిని అసహ్యించుకోవడం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం లాంటి కోణాలు ఆ పాత్రలో ఉన్నాయి. అందుకు విజయశాంతి అయితేనే ఫర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. విజయశాంతి, చిరంజీవిలది సూపర్ హిట్ కాంబినేషన్. గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, కొండవీటి దొంగ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో చిరు, విజయశాంతి రొమాన్స్ చేశారు. లాంటి వీరిద్దరిని అక్కా తమ్ముడిగా చూడడం అభిమానులకు కష్టమే. 

ఇటీవలే విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. మరి లూసిఫెర్ రీమేక్ పై విజయశాంతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.