టాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే. గ్లామర్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాలలో ఇప్పుడు ఈ బ్యూటీనే కనిపిస్తోంది. ఇక సీనియర్ హీరోయిన్స్ అవకాశాలను కూడా పూజానే లాగేసుకుంటోందని టాక్ వస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.  అయితే ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు ప్రభాస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

పూజ మాట్లాడుతూ.. "చిత్ర పరిశ్రమలో నేను కలుసుకున్న మంచి వ్యక్తుల్లో  ఆయన ఒకరు. నిజాయితీగా ఉంటారు. మంచి స్వభావం ఉన్నవారు. ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న ప్రభాస్ ఎవ్వరికైనా ఈజీగా నచ్చేస్తారు. ఎందుకంటె చాలా సాధారణంగా ఒక స్టార్ అన్న ఫీలింగ్ లేకుండా డౌన్ టూ ఎర్త్ పర్సన్" అని పూజా అన్నారు. డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో  నటిస్తోంది.

విషయం తేల్చకుండా.. ఈ నసేంటి నాగబాబు..!

ఆమె చేతిలో ఉన్నవి మంచి క్రేజ్ ఉన్న సినిమాలే. దీంతో అమ్మడు తన రేమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.1.5 కోట్ల నుండి రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది.  ఈ రెమ్యునరేషన్ పూజకి చాలా ఎక్కువని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోయిన్లు లేకపోవడంతో మేకర్లు పూజాని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

సమంతకి పెళ్లి కావడం, రకుల్ క్రేజ్ తగ్గిపోవడం, రాశి, మెహ్రీన్ లాంటి వారికి స్టార్ హోదా లేకపోవడంతో ఫిలిం మేకర్ల వద్ద మరో ఆప్షన్ లేక పూజానే తీసుకుంటున్నారు. అది పూజాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దీంతో తన రెమ్యునరేషన్ విషయంలో అమ్మడు వెనుకడుగు వేయడం లేదు.