టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఏర్పడిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరోయిన్స్ ని చూసి ఆడియెన్స్ కి బోర్ కొట్టేయడంతో స్టార్ హీరోలు కూడా ఏళ్లతరబడి కళ్ళముందు ఉన్న హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అనుష్క శెట్టి మాత్రం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది.

ఒక మీడియం హీరో రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకుంటూ అవకాశాలు అందుకుంటున్న జేజెమ్మకి పోటీగా ఇంతవరకు ఎవరు రాలేదు.  అయితే మొదటసారి డీజే బ్యూటీ పూజా హెగ్డే దేవసేన అవకాశాలకు ఎసరుపెడుతున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం పెద్ద హీరోలతో పాటు అఖిల్ వరుణ్ లాంటి యంగ్ హీరోలతో కూడా స్క్రీన్ చేసుకుంటున్న పూజా వేరే వాళ్లకు అవకాశాలు దక్కకుండా చేస్తోంది. అమ్మడి అందానికి కాస్త లక్కు తోడవ్వడంతో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచుతోంది,

రూ.8 కోట్లు.. నయనతార షాకిచ్చే రెమ్యునరేషన్!

స్టార్ హీరోల ప్రాజెక్టులు సెట్స్ పైకి వస్తున్నాయి అంటే ముందుగా పూజా హెగ్డే అనే డిస్కర్షన్ నడుస్తోంది.  అసలు మ్యాటర్ లోకి వస్తే.. మరోవైపు నిశ్శబ్దం సినిమాతో బిజీగా ఉన్న స్వీటీ మంచి అవకాశాలు వస్తే స్టార్ హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనీ ఆలోచిస్తోంది. రీసెంట్ గా కోలీవుడ్ లో ఓక స్టార్ హీరో సినిమా కోసం అనుష్క - పూజా హెగ్డే పేర్లను అనుకున్నారట. ఎవరో ఒకరిని ఫైనల్ చేయాలనీ అనుకున్నారు. కానీ ముందు చూపుతో పూజా ఆ అఫర్ ని కొట్టేయడానికి ట్రై చేస్తోందట.

రెమ్యునరేషన్ లో కొత విధించిన పరవాలేదని అమ్మడు అనుష్కకు దక్కకుండా ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే ఆ అఫర్ అనుష్క దగ్గరకు వెళ్లిందా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఈ న్యూస్ కోలీవుడ్ లో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో జేజేమ్మ అవకాశాన్ని కొట్టేసే దమ్ము పూజకి ఉందా? అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.