టాలీవుడ్ హీరో గోపీచంద్ ఒకప్పుడు కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పల్టీ కొడుతున్నాయి. వరుస పరాజయాలతో గోపీచంద్ ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు.

ఇటీవల దర్శకుడు తిరు రూపొందించిన 'చాణక్య' సినిమాపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ  సినిమా సక్సెస్ కాలేకపోయింది. గత ఐదేళ్లలో ఒక్క హిట్ కూడా లేని గోపీచంద్ కి హిందీ డబ్బింగ్ రైట్స్ మార్కెట్ ఉండడంతో ఇంకా నిర్మాతలు దొరుకుతున్నారు. ఎలాంటి కథలు చేస్తే తనను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయంలో క్లారిటీ లేని గోపీచంద్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.. టార్గెట్ ప్రభాస్?

చాలా కాలంగా తనతోనే ఉన్న మేనేజర్ ని గోపీచంద్ తీసేశాడు. అతడి వలన కొందరు యువ దర్శకులు తనను అప్రోచ్ కాలేకపోయారని.. అలా మంచి కథలు మిస్ అయిపోయానని గోపీచంద్ అతడిని తప్పించాడు. అయితే కథల ఎంపిక విషయంలో మేనేజర్ పాత్ర ఏమీ ఉండదు.

మంచి కథలు ఎంచుకోవడంలో గోపీచంద్ స్వయంగా తప్పులు చేస్తున్నాడు. అతడి వద్దకి కథలు రాక ఉన్న వాటిలో ఎంపిక చేసుకుంటున్నాడో.. లేక ప్రేక్షకులకి నచ్చే కథలను సెలెక్ట్ చేయడంలో తప్పు చేస్తున్నాడో.. కానీ గోపీచంద్ కి మాత్రం సరైన సినిమాలు మాత్రం పడడం లేదు.

ఇప్పటికైనా .. ప్రేక్షకులకి నచ్చే కథలను ఎంచుకుని.. వారి అభిరుచికి అనుగుణమైన సినిమాలు అందిస్తే మళ్లీ ట్రాక్ మీదకి వస్తాడు. 'లౌక్యం' సినిమా తరువాత హిట్ లేని గోపీచంద్ చేతిలో ఇప్పుడు ఇద్దరు నిర్మాతల నుండి రెండు ఆఫర్లు ఉన్నాయి. కానీ వాటికి ఇంకా కథలు ఫైనల్ కాలేదు. త్వరలోనే కథ ఫైనల్ చేసి సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నాడు.