ఈ మధ్యకాలంలో కొత్తగా ఇండస్ట్రీకి వస్తోన్న హీరోలపై కూడా ఐదు నుండి పది కోట్లు బడ్జెట్ పెడుతున్నారు. ఒక మిడ్ రేంజ్ హీరో బడ్జెట్ పాతిక కోట్లకు తగ్గట్లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా కోసం మాత్రం రూ.20 కోట్లే.. ఖర్చు పెట్టనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నిర్మాత దిల్ రాజు 'పింక్' రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ కాకుండా దిల్ రాజు కేటాయించిన బడ్జెట్ రూ.20 కోట్లట. పవన్ కి యాభై కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి, సినిమాని ఇరవై కోట్లలో తీసి.. వంద కోట్లకి బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నాడట దిల్ రాజు.

పవన్ రీఎంట్రీపై పరుచూరి ఏమంటున్నారంటే..?

అందుకే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తప్ప మరో స్టార్ కనిపించడు. స్టార్ హీరోయిన్స్ ని కాకుండా.. తక్కువ రెమ్యునరేషన్ కి పని చేసే నివేదా థామస్, అంజలి లాంటి హీరోయిన్లను తీసుకున్నారు. అలానే దర్శకుడు వేణుశ్రీరామ్ కి దిల్ రాజు ఆఫీస్ నుండి నెల నెలా జీతం వస్తుంది.

సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ కోర్టు రూమ్ లోనే జరుగుతుంది కనుక లొకేషన్ ఖర్చులు కూడా ఉండవు. అలా ఈ సినిమాకి తక్కువ బడ్జెట్ కేటాయించి.. పవన్ కి యాభై కోట్లు ఇచ్చినా కానీ తనకి బాగా వర్కవుట్ అయ్యేలా దిల్ రాజు ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాని వంద కోట్లకు అమ్మితే బయ్యర్లకు లాభాలు వస్తాయా లేదా అనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి.