పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రావడాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభినందించారు. పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్ లో ఇండస్ట్రీకి సంబంధించిన 
వీడియోలు చేస్తుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కి ఓ సలహా ఇచ్చారు.

'గ్యాప్ లేని రోజు రాజకీయాల్లో ఉండండి.. గ్యాప్ వచ్చిన రోజు సినిమాలు చేయండి' అంటూ ఓ వీడియోలో చెప్పాడు. 'పవన్ కళ్యాణ్ కి ఒక విషయాన్ని చెప్పాను.. మీరు వీధివీధి తిరిగి చెప్పేకంటే ఒక్క మీడియా ద్వారా , పాత్ర ద్వారా అద్భుతంగా వెళ్లిపోతాయి. కర్త‌వ్యం సినిమా చూసి చాలా మంది మ‌హిళ‌లు పోలీస్ ఆఫీస‌ర్లు కావాల‌ని అనుకున్నారు. సినిమా ప్ర‌భావం అలాంటిది' అంటూ పవన్ రాకని సమర్ధిస్తూ పరుచూరి గోపాలకృష్ణ చెప్పిన మాటలు ఇవి.

పవన్ కళ్యాణ్ పై 'ప్యాకేజ్' విమర్శలు.. కోన వెంకట్ రెస్పాన్స్!

నటన, రచన భగవంతుడు ఇచ్చిన వరం, సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నామని అన్నారు. 'సమాజంలో జరుగుతున్న అంశాలని తెరపై మేం చూపిస్తుంటే అవి నచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నారు.. కొందరినైతే ఆరాధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఇమేజ్ ఉంది. అతడు ఎంత మంచివాడో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత కూడా సినిమాలు తీశారు' అంటూ చెప్పుకొచ్చాడు.

1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తరువాత, 1994 ఎన్నికల్లో గెలవడానికి మేజర్ చంద్రకాంత్ సినిమా ఎంత ఉపయోగపడిందో.. మాకు తెలుసునని.. పవన్ ఎమ్మెల్యే అయినా నటిస్తూనే ఉండాలని అన్నారు. రాజకీయాల్లోకి వెళ్తే మేకప్ వేసుకోవడం తప్పేమీ కాదని అన్నారు. పవన్ నిర్ణయాన్ని తను అభినందిస్తున్నట్లు చెప్పారు.