పవన్ కళ్యాణ్ సత్తాని బాక్సాఫీస్ కు తెలియజేసిన చిత్రం ఖుషి. అప్పట్లో ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టింది. పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, భూమిక గ్లామర్ అప్పటి యువతని పిచ్చెక్కించాయి. భూమిక, పవన్ జోడీని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోకుండా చేసిన చిత్రం ఖుషి. 

ఈ మూవీ తర్వాత పవన్, భూమిక మరోసారి నటించలేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు చేస్తూనే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. పవన్ రీఎంట్రీ చిత్రం పింక్ రీమేక్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. అదే సమయంలో పవన్ క్రిష్ దర్శత్వంలో పీరియాడిక్ మూవీలో నటిస్తున్నాడు. 

మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటు దొంగగా నటిస్తున్నాడు. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కు హీరోయిన్లని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించాల్సి ఉంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపిస్తున్నాయి. 

RRRకు మరో షాక్.. రామ్ చరణ్, అలియా భట్ లుక్ లీక్!

ఓ హీరోయిన్ గా భూమిక నటించబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే దాదాపు 20 ఏళ్ల తర్వాత పవన్, భూమిక వెండితెరపై మెరవబోతున్నట్లు అవుతుంది. ఇది అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చే అంశం. ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శత్వంలో నటించనున్నారు. 

కియారా అద్వానీ న్యూడ్ పిక్ వైరల్.. ఇంటర్నెట్ లో సంచలనం