దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, చరణ్ అల్లూరి పాత్రలో నటిస్తున్నారు. 

రాజమౌళి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆర్ఆర్ఆర్ నుంచి లీకులు తప్పడం లేదు. కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ పులితో ఫైట్ చేస్తున్న పిక్ లీకై సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా రామ్ చరణ్, అలీ భట్ ల లుక్స్ లీకయ్యాయి. 

లీకైన ఫొటోల్లో రామ్ చరణ్ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఇక అలియా భట్ చీరకట్టులో నిండుదనంతో కనిపిస్తోంది. సామజిక మాధ్యమాల్లో ఈ పిక్ వైరల్ గా మారింది. కానీ కొందరు అభిమానులు మాత్రం ఇది ఫ్యాన్ మేడ్ లుక్ అని అంటున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#rrrmovie #rrr #ramcharan #aliyabhatt #ssrajamouli

A post shared by Cinema Circle (@1.cinemacircle) on Feb 17, 2020 at 12:01am PST

కొమరం భీం, అల్లూరి ఇద్దరూ యుక్తవయసులో అజ్ఞాతంలోకి వెళ్లిన కథని రాజమౌళి కల్పితగాధగా చూపించబోతున్నారు. రాంచరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాపై రాబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇదే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.