జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రద్రేశ్ ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంని అమలు చేయబోతున్న నేపథ్యంలో తెలుగు భాషా అభిమానుల నుంచి, పండితుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇంగ్లీష్ మీడియం విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. 

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో భాషా పండితులు నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

టాలీవుడ్ నటులకు తెలుగు మాట్లాడడం వచ్చో లేదో కానీ రాయడం మాత్రం అస్సలు రాదు. చిత్ర రంగంలో పాండిత్యం కూడా తగ్గిపోతోంది. గతంలో తెలుగులో గొప్ప గొప్ప చిత్రాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్ల స్థాయికి దిగజారిపోయింది. 

'చిరుత' హీరోయిన్ రెడ్ హాట్ లుక్స్.. వైరల్ అవుతున్న ఫొటోస్!

చాలా మంది నటులు తెలుగులో హీరోలుగా నటిస్తున్నారు. డబ్బు సంపాదిస్తున్నారు కానీ వారికి తెలుగు మాట్లాడడం, రాయడం రాదు. ఒక తెలుగు హీరోగా ఈ అంశం నాకు ఆవేదనని కలిగిస్తోంది. తెలుగు భాషని మరచిపోతే అధోగతి పాలవుతాం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. 

అల్లు అరవింద్ 1500 కోట్ల ప్రాజెక్ట్.. నో చెప్పిన రాంచరణ్, హృతిక్ రోషన్ ?

ఇదిలా ఉండగా పవన్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ ఆ మధ్యన పెద్ద హడావిడి జరిగింది. ప్రస్తుతం అలాంటి సూచనలేవీ కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయిపోయారు.