'చెప్పను బ్రదర్' కాంట్రవర్శీతో అల్లు అర్జున్ కి పవన్ కి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఇద్దరూ కలిసి కొన్ని కార్యక్రమాల్లో కనిపించినా.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడలేదు. రీసెంట్ గా 'అల.. వైకుంఠపురములో' సినిమా ఈవెంట్ లో కూడా బన్నీ.. పవన్ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

అయితే పవన్ మాత్రం అల్లు అర్జున్ కి స్పెషల్ విషెస్ చెప్పినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'అల.. వైకుంఠపురములో' ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పిస్తోంది.

చిరంజీవికి నాకు మధ్య అపార్ధాలు తొలగిపోయాయి : విజయశాంతి

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. అన్ని చోట్లా ఈ సినిమాకి పాజిటివ్ బజ్ రావడంతో కలెక్షన్స్ పరంగా భారీ నెంబర్లు చూపిస్తోంది. ఈ క్రమంలో బన్నీకి శుభాకాంక్షలు చెబుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. పూల బొకేతో పాటు చిన్న లెటర్ ని పంపించారు. అందులో బన్నీని 'అల్లు అర్జున్ గారు..' అని సంభోదిస్తూ మాట్లాడడం విశేషం.

'అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురములో సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాట్స్. ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్' అని పవన్ రాసి పంపించారు. ఈ విషయాన్ని బన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

'పవన్ కల్యాణ్ గారి నుంచి అభినందనలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యు పవన్ కల్యాణ్ గారు' అని కామెంట్ పెట్టాడు.