ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి విజయశాంతి ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయారు. మళ్లీ ఇంతకాలానికి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. సినిమాలో ముఖ్యంగా విజయశాంతి పాత్రకి మంచి పేరొచ్చింది.

ఈ సందర్భంగా ఆమె తన పాత్ర గురించి మాట్లాడింది. హుందాగా సాగే భారతి అనే పాత్ర తనకు ఎంతో నచ్చిందని.. ఈ పాత్ర మహిళలను బాగా ఆకట్టుకుందని అన్నారు. నలభై ఏళ్ల అనుభవం ఉండడంతో మళ్లీ కెమెరా ముందుకు రావడం తనకేమీ కొత్తగా అనిపించలేదని చెప్పారు.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లో మేజర్ హైలెట్ ఎపిసోడ్ ఇదే!

కృష్ణగారి కుంటుంబంతో తనకు ఏదో అనుబంధం ఉందనిపిస్తుందని.. 'కొడుకు దిద్దిన కాపురం' సినిమా చేస్తున్నప్పుడు మహేష్ చిన్నపిల్లాడని.. సూపర్ స్టార్ అయిన తరువాత ఎలా ఉంటాయో అనుకున్నానని.. కానీ తొలిరోజు తనతో మాట్లాడగానే సందేహాలన్నీ పోయాయని చెప్పారు. షూటింగ్ సమయంలో మహేష్ ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.

రాజకీయాల్లో ఒత్తిడితో బీపీ పెరిగిపోతుందని.. సినిమా చేస్తున్నప్పుడు మాత్రం మనశ్శాంతిగా ఉంటుందని చెప్పారు. సినిమా షూటింగ్ సమయంలో బాగా నవ్వుకున్నామని.. విడుదలకు ముందు వేడుకలో చిరంజీవిని కలవడం గొప్ప అనుభూతి అని చెప్పారు.

తను రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత చిరంజీవితో దూరం పెరిగిందని.. ఆ వేడుక తరువాత మా మధ్య ఉన్న అపార్దాలన్నీ తొలగిపోయాయని చెప్పారు. ఇకపై సినిమాల్లో సాధారణ పాత్రలు చేయనని.. నటిగా తనకున్న గౌరవాన్ని తగ్గించుకోనని చెప్పారు.