పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడనే తెల్సినప్పటి నుండి ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. పవన్ సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయంపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటివరకు 'వకీల్ సాబ్' టైటిల్ పై ఎన్ని ఫ్యాస్ మేడ్ పోస్టర్స్ చేశారో.. కొన్ని టీషర్ట్స్ కూడా బయటకి వచ్చాయి.

ఓ పక్క 'పింక్' సినిమా రీమేక్ చేస్తూనే.. మరోపక్క దర్శకుడు క్రిష్ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. గురువారం నాడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొని తరువాత సాయంత్రానికి తన పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యాడు. చాలా కాలం తరువాత పవన్ గడ్డం తీసేసి క్లీన్ షేవ్ తో కనిపించాడు.

పవన్ కోసం బికినీ బ్యూటీ.. క్రిష్ ఛాయిస్ కరెక్టేనా..?

దీంతో పవన్ అభిమానుల్లో ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఈ లుక్ లో పవన్ బాగున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ మీటింగ్ లో పవన్ ఫోటోలు కొన్ని బయటకి వచ్చాయి. ఆ ఫోటోలలో పవన్ చేతిపై టాటూ కనిపిస్తోంది.

సాధారణంగా పవన్ ఇలాంటి టాటూలు వేసుకోరు. అది కచ్చితంగా క్రిష్ సినిమా కోసమేనని అంటున్నారు. ఆ టాటూ గద్దను పోలి ఉండగా.. మొగలుల కాలంలో బందిపోట్లు ఇలాంటి పచ్చబొట్లు వేసుకునేవారని.. పవన్ చేస్తున్నది ఆ కాలం నాటి దొంగ పాత్ర అని.. ఈ టాటూ వెనుక కథలను అల్లేస్తున్నారు.

ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు ఎదురుచూడాల్సిందే. ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.