పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రీమేక్‌ లో నటిస్తోన్న పవన్.. క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకుల చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించబోయే సినిమాలో అతడు రాబిన్ హుడ్ లాంటి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు.

తెలంగాణాకి చెందిన సాయన్న అనే యోధుడిని స్ఫూర్తిగా తీసుకొని పవన్ పాత్ర రాసుకున్నారని సమాచారం. పవన్‌ ఇమేజ్‌ క్రేజ్‌ తగ్గ మాస్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సందేశాత్మకంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట.

PSPK27: ఉన్నోళ్లని కొట్టిండు.. లేనోళ్లకి పెట్టిండు!

దీంతో పవన్ పక్కన హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డాడు క్రిష్. అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ సరసన బాలీవుడ్ సెక్సీ బ్యూటీ వాణీ కపూర్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఆమెని ప్రాజెక్ట్ లోకి తీసుకొస్తే ప్యాన్ ఇండియా అప్పీల్ వస్తుందని భావిస్తున్నాడు క్రిష్.

ఈ మేరకు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. తన బికినీ లుక్స్ తో వాణీ కపూర్ బాగా పాపులర్ అయింది. తెరపై కూడా ఈ బ్యూటీని హాట్ గా చూపించడానికే మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. మరి క్రిష్ తన హీరోయిన్ ని ఎలా ప్రెజంట్ చేస్తాడో చూడాలి.

రీసెంట్ గా 'వార్' సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. తెలుగులో నాని నటించిన 'ఆహా కళ్యాణం' సినిమాలో నటించింది. మళ్లీ ఇంతకాలానికి పవన్ సినిమాలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలానే సినిమాలో మరో హీరోయిన్ క్యారెక్టర్ కి స్కోప్ ఉండడంతో ఆ పాత్రలో ప్రగ్యాజైస్వాల్ ని తీసుకుంటున్నారని తెలుస్తోంది.