Asianet News TeluguAsianet News Telugu

'పింక్' రీమేక్.. పవన్ కోసం భారీ కోర్టు సెట్!

బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. 

Pawan Kalyan's Pink remake to go on floors from this date
Author
Hyderabad, First Published Jan 15, 2020, 11:25 AM IST

'అజ్ఞాత‌వాసి' సినిమా త‌ర్వాత పూర్తి రాజ‌కీయాల‌తో బిజీ అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు.

ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాపై ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చిత్రబృందం కానీ స్పందించ లేదు.

శేఖర్ మాస్టర్ కి మహేష్ బాబు ఆఫర్..!

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా జ‌న‌వ‌రి 20న సెట్స్ పైకి వెళ్లనుందట.  ఫిబ్ర‌వ‌రిలో ప‌వ‌న్ టీంతో జాయిన్ కానున్నాడ‌ని, కేవ‌లం ఇరవై రోజులు మాత్రం ఆయన కాల్షీట్స్ ఇచ్చాడని అంటున్నారు.

ఇప్పుడు ఈ సినిమా కోసం హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఈ కోర్టు సెట్ లోనే చిత్రీకరించనున్నారు. ఈ సినిమా కోసం పవన్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడని సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios