టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

సినిమా సక్సెస్ ని యూనిట్ ఎంజాయ్ చేస్తోంది. హిట్ టాక్ వచ్చినా.. చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలతో హల్చల్ చేస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు దర్శకుడు అనీల్ రావిపూడి.. మహేష్ కి చదివి వినిపించాడు. అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు మహేష్ కూల్ గా సమాధానమిచ్చాడు.

బడ్జెట్ హద్దులు దాటుతున్న హీరోలు.. సౌత్ బిగ్గెస్ట్ కాంబినేషన్స్

తన తదుపరి సినిమాలో పోకిరి మహేష్ యాటిట్యూడ్ అండ్ ఇంటెన్స్ కావాలని ఓ అభిమాని కోరగా.. దానికి సమాధానంగా కచ్చితంగా భవిష్యత్తులో గొప్ప చిత్రాలను చేద్దామని.. పోకిరిని మించి చేద్దామని తెలిపాడు.

అంతేకాక సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ లో శేఖర్ మాస్టర్ డాన్స్ బాగా కంపోజ్ చేశారని.. ఇక నుండి ప్రతీ సినిమాకి అతడినే కొరియోగ్రాఫర్ గా పెట్టుకోవాలని మరో ఫ్యాన్ సజెస్ట్ చేయగా.. తప్పకుండా తన సినిమాలో కనీసం రెండు పాటలకు శేఖర్ మాస్టర్ తో కలిసి పని చేస్తామని మహేష్ మాటిచ్చాడు.