పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ-ఎంట్రీ ఖాయమైనట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి బాలీవుడ్ లో విజయం సాధించిన ‘పింక్’ రిమేక్ లో పవన్ నటించబోతున్నారు. ఈ చిత్రానికి యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.   దీంతో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

మరికొందరు పవన్ అభిమానులు మాత్రం...ఇంకా పవన్ అసలు అధికారంగా ప్రకటించకుండా ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు, ఆయన పూర్తి స్దాయి రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు అంటూ మండిపడుతన్నారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా పవన్ మళ్లీ తెరపై చూడాలన్న కోరిక తీరబోతుందనే ఆనందం అయితే అభిమానుల్లో ఉంటుందనేది కాదనలేని సత్యం.

అఫీషియల్: 'జార్జి రెడ్డి'తో రామ్ గోపాల్ వర్మ సినిమా..!

అయితే ఈ వార్తలు ఇక్కడితో ఆగలేదు. ఈ సినిమాకు  ‘లాయర్ సాబ్’ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇంకా పవన్ అసలు సినిమా చేస్తారో లేదో తెలియని పరిస్దితుల్లో ఫలనా టైటిల్ అంటూ ముందుకు రావటం మాత్రం విచిత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా..అసలు సినిమా ఉంటుందో లేదో..పవన్ చేస్తాడో లేదో తెలియదు..కానీ టైటిల్ మాత్రం  ‘లాయర్ సాబ్’ అని నవ్వేస్తున్నారు.
 
బిగ్ బీ అమితాబ్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘పింక్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి అనిరుధ్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించారు. ఇందులో లాయర్ పాత్రలో అమితాబ్ అదరగొట్టాడు. ఈ సినిమాని అజిత్ హీరోగా బోనీకపూర్ రీమేక్ చేసారు. ఇప్పుడు తెలుగు రిమేక్ ని పవన్ కల్యాణ్ చేయనున్నారు. పవన్ కంటే ముందు ఈ సినిమా బాలయ్య దగ్గరకి వెళ్లింది. దిల్ రాజు ఈ కథని బాలయ్యతో చేద్దామని ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఇక  తెలుగు పింక్ కోసం ‘లాయర్ సాబ్’ టైటిల్ నే ఫిక్స్ చేస్తారా ? లేదంటే మరో పవర్ ఫుల్ టైటిల్ ని వెతుకుతారా ? అన్నది చూడాలి.
 
 ఈ మూవీకి బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నాడని కూడా తెలుస్తోంది.  పింక్ మూవీని ఇటీవలే తమిళ్‌లో రీమేక్ చేశారు. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం ‘నెర్కొండ పార్వాయి’ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇందులో విద్యా బాలన్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు కీలక పాత్రలలో నటించగా.. బోని కపూర్ నిర్మించారు.