పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొన్నటివరకు రాజకీయాలతో బిజీగా ఉండేవారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ఇటీవలే 'పింక్' రీమేక్ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఫోటోలు కొన్ని బయటకి లీక్ అయ్యాయి.

దీంతో షూటింగ్ స్పాట్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో కచ్చితంగా కమెడియన్ అలీ కనిపిస్తుంటాడు. అలీ తన సినిమాలో కనిపించడమనేది పవన్ సెంటిమెంట్. అయితే రాజకీయాల కారణంగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.

హీరో విజయ్ ఇంట్లో ఐటి సోదాలు.. భారీగా తరలి వచ్చిన అభిమానులు

అలీ వైఎస్సార్ సీపీ లో చేరడంతో పవన్ కళ్యాణ్ అతడిపై విమర్శలు చేశారు. ఈ విషయం అలీని ఎంతగానో బాధించింది. అయినప్పటికీ రాజకీయాల కారణంగా తమ స్నేహం చెడిపోదని అలీ అప్పట్లో ఒకసారి చెప్పారు.

పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనని చెప్పారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు అలీకి ఫోన్ చేసినట్లు సమాచారం. రాజకీయాల కారణంగా తమ మధ్య పెరిగిన దూరాన్ని పక్కనపెట్టి అలీకి పవన్ ఫోన్ చేశారట.

తన కొత్త సినిమా 'పింక్' రీమేక్ లో నటించాలని పవన్ స్వయంగా అలీని కోరాడట. అయితే ఈ విషయంలో అలీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్.