కోలీవుడ్ లో మరోసారి ఐటి దాడులు కొనసాగుతున్నాయి. నిన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ని షూటింగ్ మధ్యలోనే విచారణ జరిపిన అధికారులు ఇప్పుడు చెన్నైలోని విజయ్ నివాసాలను కూడా టార్గెట్ చేశారు.  ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు తమిళ సినిమా ఇండస్ట్రీలోని కొంత మంది ప్రముఖుల ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

ఇక ఉదయానే విజయ్ ఇంటికి చేరుకున్న ఆఫీసర్స్ నిర్విరామంగా విజయ్ ని విచారిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. బీజేపీ కావాలని హీరోని టార్గెట్ చేసిందని చెబుతున్నారు. గతంలో మూడు సార్లు విజయ్ సినిమాల్లో బీజేపీ కి కౌంటర్ ఇచ్చే విధంగా డైలాగ్స్ చెప్పారు.   ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

చిత్ర నిర్మాణ సంస్థ AGS ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై కూడా అధికారులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. సంస్థ కార్యాలయంలో 24కోట్లను కోట్లు మరో చోట 50కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. బిగిల్ సినిమా బడ్జెట్ నుంచి కలెక్షన్స్ వరకు అన్ని విషయాల్లో అనుమానాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న అధికారులు ఏకకాలంలో సినిమాకు సంబందించిన అని వర్గాల నుంచి సోదాలు చేపట్టారు.

ఇక 2017లో వచ్చిన మెర్సల్ సినిమా సంస్థతో సంబంధం ఉన్న పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆ సినిమాలో GST ని హేళన చేస్తూ డైలాగ్స్ ఉండటాన్ని బిజెపి నేతలు అప్పట్లో తీవ్రంగా ఖండించారు.  ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. షూటింగ్ జరుగుతుండగా సడన్ గా లొకేషన్ లోకి వచ్చిన ఐటి ఆఫీసర్స్ విజయ్ ని పిలిచి పర్సనల్ గా విచారణ జరిపారు.