జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత సినిమాలను పక్కన పెట్టేశాడు. దీంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు. పవన్ ఇక సినిమాల్లోకి రావడం కష్టమనే మాటలు వినిపించాయి. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వచ్చాయి.

దీనిపై బాలీవుడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇప్పటికే ఓ పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు చెప్పారు. వేణుశ్రీరామ్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సినిమా ఉంటుందని చెప్పారు. దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారని చెప్పారు.

షాకింగ్ : హీరోయిన్ సంజనతో అల్లు అరవింద్ అడల్ట్ జోక్స్

అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు. గతంలో పవన్ సినిమాల్లోకి వెళ్తున్నారనే వార్తలు వస్తే తీవ్ర స్థాయిలో ఆయన పార్టీ ఖండించేది. కానీ ఈసారి మాత్రం పార్టీ సైలెంట్ గా ఉండిపోయింది. అలానే తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సినిమాల్లోకి రాబోతున్నారని చెప్పడానికి హింట్స్ ఇచ్చినట్లుగా ఉన్నాయి.

ఇటీవల విశాఖపట్టణంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన పవన్ తన స్పీచ్ లో రాజకీయాల కోసం ఎవరు వ్యాపారాలు మానుకున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ''అవంతి గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా?'' అని ప్రశ్నించారు. సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. చేస్తానో లేదో తనకే తెలియదని, నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తారని పవన్ స్పష్టం చేశారు.