జనసేన పార్టీ 6వ ఆవిర్భావసభ నేడు రాజమండ్రిలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సభకు జనసేన ముఖ్యనాయకులతోపాటు పార్టీ కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. 

పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

ఇక పవన్ కళ్యాణ్ తాను పార్టీ పెట్టాలన్నప్పుడే తాను కోపతాపాలు వదిలేసానని, సమాజమే కుటుంబం అనుకోబట్టే పార్టీ పెట్టానని అన్నాడు. అలా తాను కోపాన్ని త్యజించాను అనడానికి ఒక చక్కటి ఉదాహరణను ఇస్తూనే శ్శ్రీ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు పవన్. 

Also read: 8 ఏళ్ల తరువాత పవర్ స్టార్ డబుల్ బొనాంజా

చాలా మంది తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, రాజకీయంగా నిన్న మొన్న కూడా దూషించారని, కానీ తనకు కోపం అనేది లేదని అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడడానికే నిశ్చయించుకున్నానని అన్నాడు. 

తన వరకు మాత్రమే కాకుండా తన తల్లిని కూడా దూషించారని, ఉప్పు కారం తింటున్న పౌరుషం ఉండదా, కోపం రాధా కడుపు మండదా అని ప్రశ్నించారు. గతంలో మాదిరి కేవలం ఆక్టర్ నే అయి ఉంటే గతంలో తాను ఎలా రియాక్ట్ అయ్యే వాడినో అలాగే రియాక్ట్ అయ్యేవాడినని, కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను పార్టీ పెట్టాను కాబట్టి కోపాన్ని వదిలేసానని అన్నాడు. 

ఇలా శ్రీ రెడ్డి తన మీద వ్యాఖ్యలు చేసినప్పటికీ తాను ఎందుకు రియాక్ట్ అవ్వడంలేదో తెలిపాడు. అలా తాను కోపాన్ని ధాటి వచ్చేశానని, ఇప్పుడు సమాజమే కుటుంబంగా బ్రతుకుతున్నట్టు తెలిపాడు. 

ఇలా పార్టీ పెట్టబట్టే సుగాలి ప్రీతీ లాంటి కేసుల్లో తాను సహాయం చేయగలిగామని అంత పోరాటం తరువాతే ఆ కేసు సిబిఐ చేతికి వెళ్లిందని పవన్ అన్నాడు. 

ఇక సినిమాల విషయానికి వస్తే... తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  

ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..ఉమెన్స్ డే సంధర్భంగా ఈ చిత్రం నుండి ఓ లిరికల్ సాంగ్ విడుదల చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ చిత్రం కథ ప్రకారం పవన్ భార్య పాత్ర కోసం ఓ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు సమాచారం.

Also read: రౌడీలు కాబట్టి కాల్చేశారు: దిశ రేప్, హత్య కేసుపై పవన్ కల్యాణ్

ఈ సినిమాలో వచ్చే  కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్య తో ఉండే ఎపిసోడ్ ఒకటుంది.  ఆ ఎపిసోడ్ లో ...తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే పాత్రను శృతి హాసన్ చేయబోతున్నట్టు హాట్ అప్ డేట్.  

ఇప్పటికే ఈ విషయంపై ఆమెని సంప్రదించటం, ఒప్పుకోవడం జరిగిందని సమచారం. కథ ప్రకారం ఈ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు. అయినా గుర్తుండిపోయే పాత్ర కావటంతో శృతి సరేనందిట.  

గతంలో వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ రికార్డ్ హిట్ . ఆ చిత్రం తర్వాత శృతి హాసన్  టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరసగా రవితేజ, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన వరస సినిమాలు చేసింది.

ఇప్పుడు రవితేజ క్రాక్ తో ఫ్రెష్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన శృతి హసన్ కు వకీల్ సాబ్ ఆఫర్ అంటే మంచి ఆఫర్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం తనకు పవన్ కు,శృతితో ఒక డీసెంట్ ఎమోషనల్ సాంగ్ ఉంటుందట. అలాగే కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది, కాని ఆమె పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది.