పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తరువాత వెండి తెరపై కనిపించబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో సిద్దమవుతున్న పవర్ స్టార్ వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఎనిమిదేళ్ల తరువాత పవన నుంచి ఒక డబుల్ బొనాంజా రాబోతోంది.

పవర్ స్టార్ తన కెరీర్ లో ఒకే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేయడం అనేది చాలా రేర్.  కెరీర్ మొదట్లో సుస్వాగతం - తొలి ప్రేమ (1998) అనే రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక 2006లో అన్నవరం - బంగారం సినిమాలు విడుదల అవ్వగా 2011లో పంజా - తీన్ మార్ సినిమాలు వచ్చాయి.

2012లో కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు - గబ్బర్ సింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.  ఇక మళ్ళీ 8 ఏళ్ల తరువాత పవర్ స్టార్ నుంచి ఒకే ఏడాది రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఏడాది పవన్ వకీల్ సాబ్ తో పాటు క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న వీరూపాక్షి సినిమా కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సగానికి పైగా వకీల్ సాబ్ పనులు పూర్తయ్యాయి. మే లో సినిమాను రిలీజ్ చేసేందుకు దిల్ రాజు గట్టి ప్రయత్నాలుచేస్తున్నారు . ఇక విరుపాక్షి సినిమాని కూడా వీలైనంత త్వరగా మొదలుపెట్టి ఇదే ఏడాది నవంబర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా పవన్ చాలా కాలం తరువాత డబుల్ బొనాంజాతో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇస్తాడని చెప్పవచ్చు.