టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు 35కోట్ల షేర్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలం తరువాత సాయికి మంచి సక్సెస్ రావడంతో సెలబ్రెటీల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

ఇకపోతే మెగా మేనల్లుడికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ విషెస్ అందించారు. మంచి మెస్సేజ్ తో మేనల్లుడికి సర్ ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి. డీయర్ సాయి ధరమ్ తేజ్ గారికి ప్రతిరోజు పండగే సక్సెస్ అయిన సందర్భంగా నా హృదయపూర్వక శుబాకాంక్షలు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నట్లు పవన్ లేఖలో పేర్కొన్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ తన మమ్మయ్య పంపిన సందేశాన్ని ఆడియెన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఈ మెస్సేజ్ తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ప్రతిరోజు పండగే సినిమా గత ఏడాది డిసెంబర్ ఓ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. GA2 - యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ కీలకపాత్రలో కనిపించారు. 

ప్రభాస్ 20.. కన్ఫ్యూజన్ మొదలైంది?