బాహుబలి ప్రభాస్ గత ఏడాది భారీ స్థాయిలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా అభిమానులు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దీంతో ప్రభాస్ తదుపరి సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎదో ఒక విధంగా సాహో పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తెచ్చేసింది.   మళ్ళీ పెద్ద సినిమాలు  చేయనని చెప్పిన డార్లింగ్ ఇమళ్ళీ అదే బాటలో అడుగులు వేయక తప్పడం లేదు.

జాన్ సినిమా కోసం దాదాపు 150కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన టైటిల్ విషయంలో చిత్ర యూనిట్ ఇటీవల డీప్ డిస్కర్షన్ చేసినట్లు తెలుస్తోంది. అసలైతే ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ ని సెట్ చేయాలనీ అనుకున్నారు. కానీ రీసెంట్ గా దిల్ రాజు ప్రభాస్ కి పెద్ద షాక్ ఇచ్చాడు. శర్వానంద్ - సమంత జంటగా నటిస్తున్న 96 రీమేక్ కి జాను అనే టైటిల్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే మళ్ళీ అదే టైటిల్ సింక్ అయ్యే విధంగా ఇంత పెద్ద సినిమాకు జాన్ అనే టైటిల్ సెట్ చేయడం అవసరమా అని చిత్ర యూనిట్ సందిగ్ధంలో పడిందట. రెండు పేర్లకి ఉన్న అర్ధాలు వేరైనప్పటికీ దాదాపు అక్షరాలు దగ్గరగానే ఉన్నాయి.  దీంతో చిత్ర యూనిట్ చేసేదేమి  లేక టైటిల్ లో మార్పులు చేయాలనీ చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే టైటిల్ ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా నడుస్తుందట.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని యూరప్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మరో షెడ్యూల్ ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. అసలైతే ఈ షెడ్యూల్ కూడా యూరప్ లోనే చేయాలనీ అనుకున్నారు.  కానీ మళ్ళీ కొన్ని కారణాలతో ఇండియాకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ సినిమాలో 1980ల కాలం నాటి వాతావరణం కనిపించేలా సెట్స్ ని డిజైన్ చేస్తున్నారట. గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రభాస్ కోసం 25రకాల భారీ సెట్స్ ని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లలో కనిపించిననున్నట్లు టాక్.