పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత ఆయన తిరిగి సినిమాలు చేయరేమోనని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ 'పింక్' రీమేక్ మొదలుపెట్టి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు. ఈ సినిమా మొదలైన కొన్ని రోజులకే దర్శకుడు క్రిష్ తో మరో సినిమాకి శ్రీకారం చుట్టాడు.

ఈ రెండు ప్రాజెక్ట్ లతో పాటు మరో భారీ బడ్జెట్ సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. చాలా కాలంగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది.

పవన్ తరువాత మరొక మెగా హీరోతో క్రిష్ న్యూ మూవీ?

ఎట్టకేలకు ఈ సినిమాని ఫైనల్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ అకౌంట్ లో పవన్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. డైరెక్టర్ మరెవరో కాదు.. పవన్ తో 'గబ్బర్ సింగ్' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన హరీష్ శంకర్.

 'డీజే' సినిమా తీసి.. సుమారు రెండేళ్లు గ్యాప్ తర్వాతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' ను తెరకెక్కించి కమర్షియల్ హిట్ అందుకున్నారు దర్శకుడు హరీష్ శంకర్. ఇప్పుడు తన తదుపరి సినిమా పవన్ కళ్యాణ్ తో చేస్తుండడం విశేషం.

ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ సంతోషానికి అవధుల్లేవు. 'ఇది రా న్యూస్ అంటే..', 'అన్నా.. ఈసారి నువ్ కొట్టడం ఖాయం' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.