బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటించిన 'పతి పత్ని ఔర్ వో' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ముదస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించగా.. అతడి భార్య పాత్రలో నటి భూమి పెడ్నేకర్ కనిపించనుంది.

కథ ప్రకారం అనన్య.. కార్తిక్ ప్రేయసిగా కనిపించనుంది. పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో అనన్య  నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య తనకు ఎలాంటి వ్యక్తి బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా రావాలనుకుంటుందనే విషయాన్ని వెల్లడించింది.

‘ప్రతిరోజూ పండగే’ ..ఆ హాలీవుడ్ సినిమా నుంచి లేపారా?

ప్రేమ విషయంలో తను చాలా నిజాయితీగా ఉంటానని చెప్పిన అనన్య తన సంతోషం కోసం మరొకరి కాపురాలు కూల్చే టైప్ కాదని చెప్పింది. తను చాలా రొమాంటిక్ అని, ప్రేమలో పడడమంటే చాలా ఇష్టమని.. తనకు చాలా రిలేషన్షిప్స్ ఉండేవని చెప్పింది. అందులో తప్పు లేదని.. స్కూల్ లో చదువుకునేప్పుడు చిన్న చిన్న లవ్ స్టోరీస్ అందరికీ ఉంటాయని చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో హీరో తనకు పెళ్లైనప్పటికీ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటాడు. అలాంటి వ్యక్తి తనకు బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా అసలు వద్దని చెప్పింది అనన్య. తను నిజాయితీగా ఉంటుంది కాబట్టి తన బాయ్ ఫ్రెండ్ కూడా అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటానని చెప్పింది. మరి ఈ బ్యూటీ కోరుకుంటున్నట్లు త్వరలోనే బాయ్ ఫ్రెండ్ ని  వెతుక్కుంటుందేమో చూద్దాం!