ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ నుంచి పలువురు సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు. పరుచూరి గోపాలకృష్ణ, కమెడియన్ పృథ్వి లాంటి వారు మీటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు. కొందరు సభ్యుల తీరు నచ్చక పరుచూరి కంటతడి పెట్టుకుంటూ వెళ్లిపోయారని పృథ్వి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. 

దీనిపై పరుచూరి స్పందించారు. మీటింగ్ లో తనకు కొందరు సభ్యుల ప్రవర్తన నచ్చలేదని అన్నారు. అందుకే బయటకు వెళ్ళిపోయా. కానీ నేను కంటతడి పెట్టుకోలేదు అని క్లారిటీ ఇచ్చారు. నటుడు ఉత్తేజ్ కూడా ఇదే విషయాన్నీ ప్రస్తావించారు. మా అసోసియేషన్ లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని ఉత్తేజ్ అన్నారు. 

ఏడుస్తూ వెళ్లిపోయిన పరుచూరి.. కమెడియన్ పృథ్వి సంచలన కామెంట్స్!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి మాట్లాడుతూ మా అసోసియేషన్ అనేది ఒక కుటుంబం. మన ఫ్యామిలి కూడా సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కరించుకుంటాం. అలాగే మా అసోసియేషన్ లో ఉన్న విభేదాలు కూడా సమసిపోతాయని జయలక్ష్మి అన్నారు. 

మీటింగ్ కు వెళ్లే సమయంలో రాజశేఖర్ నరేష్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. జీవిత మాట్లాడుతూ నరేష్ పై వస్తున్న ఆరోపణలకు ఆయనే సమాధానం ఇచ్చుకోవాలని, మా అసోసియేషన్ మంచి కార్యక్రమాలు చేసేందుకే ఉందని జీవిత అన్నారు. 

MAAలో షాక్.. నరేష్ ని లెక్కచేయని జీవిత రాజశేఖర్.. సంచలన ఆరోపణలు!