మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నరేష్ బాధ్యతలు సీకరించి 6 నెలలు గడవకముందే అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. కలసి పోటీ చేసిన జీవిత రాజశేఖర్ దంపతులు, నరేష్ మధ్య ఇప్పుడు పొసగడం లేదు. వీరిమధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ విభేదాలు ఇగోల వల్లే వచ్చినట్లు తెలుస్తోంది. 

తాజాగా నరేష్, జీవిత రాజశేఖర్ మధ్య దూరం పెరిగింది. మా అధ్యక్షడిగా నరేష్ లేకుండా జీవిత రాజశేఖర్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. దీనిపట్ల నరేష్ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్యక్షుడు లేకుండా మా అసోసియేషన్ సమావేశం ఎలా నిర్వహిస్తారు అంటూ నరేష్ తరపున న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. 

రాజశేఖర్ మా సభ్యులకు అత్యవసర సమావేవం అని మెసేజ్ చేశారు. అందరూ తప్పకుండ హాజరు కావాలని పేర్కొన్నారు. కానీ జీవిత మాత్రం ఇది ఫ్రెండ్లీ సమావేశం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. 

గతంలో ఇలా ఎప్పుడూ మా అసోసియేషన్ లో గొడవలు లేవు. గత రెండు పర్యాయాలు నుంచే విభేదాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేష్ ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండడం వల్లే తాము సమావేశాలు నిర్వహిస్తున్నాం అంటూ రాజశేఖర్ చెబుతున్నారు. దీనిపై నరేష్ స్పందించాల్సి ఉంది.