Asianet News TeluguAsianet News Telugu

‘పారాసైట్‌’కి 4 ఆస్కార్‌ లు, దేశంలో తొలి ఆస్కార్!

ఇన్నాళ్లూ ఏ కేటగిరీలోనూ ఆస్కార్ అందుకోని సౌత్ కొరియన్ సిని ప్రపంచం తొలసారిగా ఈ సినిమాతో విజయకేతనం ఎగరేసింది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న సౌత్ కొరియన్ తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. 

Parasite wins Best Picture, making Oscar history
Author
Hyderabad, First Published Feb 10, 2020, 1:22 PM IST

ఇప్పుడు ఎక్కడ విన్నా దక్షిణ కొరియా చిత్రం పారాసైట్‌ గురించే మాట్లాడుకుంటున్నారు.  హాలీవుడ్ ని ప్రక్కన నెట్టేసిన ఈ సినిమా... ఆస్కార్‌ అవార్డుల పంట పండించుకుంది. మొత్తం నాలుగు కేటగిరీల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్ర్కీన్‌ప్లైతో పాటు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ పిల్మ్‌ విభాగాల్లో అస్కార్‌ అవార్డులను దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఇన్నాళ్లూ ఏ కేటగిరీలోనూ ఆస్కార్ అందుకోని సౌత్ కొరియన్ సిని ప్రపంచం తొలసారిగా ఈ సినిమాతో విజయకేతనం ఎగరేసింది. ఆస్కార్ అవార్డ్ అందుకున్న సౌత్ కొరియన్ తొలి సినిమాగా చరిత్ర సృష్టించింది. కలెక్షన్స్ పరంగానూ ఘన  విజయాన్ని అందుకున్న ఈ సినిమా గురించి గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సిని అభిమానులు ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు.

నాలుగు ఆస్కార్ లు పొందిన ‘పారాసైట్‌’ రివ్యూ!

ఆస్కార్ విశ్లేషకుల ఎక్సపెక్టేషన్స్ కు అందకుండా పారాసైట్ ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో థ్రిల్లర్ మూవీ పారాసైట్.. మొత్తం 6 నామినేషన్ల పొందింది.  దర్శకుడు బాంగ్, అతని సహ దర్శకులు హాన్ జిన్ ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లేకు ఫస్ట్ అవార్డు వరించింది.

ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ...ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. స్ర్కిప్ రాసుకున్నది మూవీ కోసమే.. అవార్డ్ ల కోసం ఎప్పుడూ స్ర్కిప్ట్ రాయలేదు.. కానీ, ఇది సౌత్ కొరియాకు దక్కిన మొట్టమొదటి ఆస్కార్ అంటూ ట్రోఫీని పైకెత్తుతూ ఆనందం వ్యక్తం చేశారు. మేకింగ్‌తో పాటు కంటెంట్‌లోను హాలీవుడ్ సినిమాకి ధీటుగా ఈ సినిమాను తెరకెక్కించటం కలిసొచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios