ఈ ఏడాది లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేట‌ర్‌లో జ‌రుగుతున్న 92వ ఆస్కార్ అవార్డ్ వేడుక‌లో పారాసైట్‌, జోక‌ర్,1917  చిత్రాలు త‌మ హ‌వా చూపిన సంగతి తెలిసిందే. ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన పారాసైట్( కొరియ‌న్ చిత్రం)  ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డుల‌ని ఎగ‌రేసుకుపోయింది. ఈ చిత్రానికి గాను ఉత్త‌మ డైరెక్ట‌ర్ అవార్డ్ కూడా ద‌క్క‌డం విశేషం. మొదటనుంచీ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకున్న పారాసైట్ అనే ఈ ద‌క్షిణ కొరియా చిత్రం ఆస్కార్ కిరీటం ద‌క్కించుకోవ‌డం విశేషం.  ఈ చిత్రం కథేంటి...ఆస్కార్ అవార్డ్ లు వచ్చేటంత గొప్ప విషయం ఈ సినిమాలో ఏముందో చూద్దాం.

కథేంటి :

సియోల్ సిటీలో ఓ మిడిల్ క్లాస్ కుటుంబం. ఎంత మిడిల్ క్లాస్ అంటే చివరకు వాట్సప్ ఓపెన్ చెయ్యాలన్నా ప్రక్కింటి సిగ్నల్స్ మీద ఆధారపడాల్సిన పరిస్దితి. ఆ కుటంబంలో ఉన్న కుర్రాడుకు తన స్నేహితుడు ద్వారా ఓ ఆఫర్ వస్తుంది. తను పై చదువుకి విదేశాలకు వెళ్తూ...తను ఇన్నాళ్లూ చేస్తున్న ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్ ని తన స్నేహితుడికి అప్పచెప్తారు. ఆ విధంగా ఓ కోటీశ్వరుడు కుటుంబంలోకి ఓ ట్యూటర్ గా ప్రవేశిస్తాడు ఈ మిడిల్ క్లాస్ కుర్రాడు. వాడు అక్కడికి వెళ్ళాక తన ఫ్యామిలీలో ఉన్న మిగతావాళ్లైన చెల్లి, తల్లి,తండ్రిని కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న మిగతా జాబ్ లోకి లాగాలని ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఆ ఇంట్లో ఉన్న జాబ్స్ అన్ని ఫిల్ అయ్యాయి.

అందుకోసం తనదైన ట్రిక్కులు ఉపయోగించి వాళ్లను గెంచించటం లేదా జాబ్ లు వదిలివెళ్లిపోయేలా చేస్తాడు. తన తండ్రికి డ్రైవర్ గా, తన చెల్లికి ఆర్ట్ టీచర్ గా, తన తల్లికి హౌస్ మెయిడ్ గా పని ఇప్పిస్తాడు. అయితే పొట్ట కక్కుర్తి కోసం చేసిన ఈ చెత్త పని ఎంతకాలం దాగుతుంది. హౌస్ మెయిడ్ గా చేసే ఆమెకు అసలు విషయం తెలిసిపోతుంది. తనను ప్లాన్ చేసి తప్పించారని. అక్కడ నుంచి ఆమె బ్లాక్ మెయిల్ ప్రారంబిస్తుంది. అయితే ఆమెకు ఆ ఇంటితో ఓ రహస్య అవసరం ఉంటుంది. అదేంటి...ఆమె బ్లాక్ మెయిల్ కు వీళ్లు ఎలా స్పందించారు. చివరకు ఏమైంది అనే విషయాలతో సినిమా కథ జరుగుతుంది.

ఏంటి ఈ సినిమా గొప్పతనం :

మానవ సంభందంల్లో ఉన్న మంచి,చెడు రెండింటిని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. లో మిడిల్ క్లాస్ బ్రతుకులు ఎంత దుర్బరమో..దాన్నుంచి బయిటపడటానికి ఎంత కష్టపడతారో, ఎంతకు తెగిస్తారో చూపెడుతుంది. అదే సమయంలో అందుకోసం చేసే పనులు ...ఏ విధంగా ఇరుకున పెడతాయో చూపెడుతుంది. ఈ పాత్రల్లో మనని మనం చూసుకోగలుగుతాం. వాళ్ల చేసింది తప్పు అయినా మనకు వారిపై కోపం రాదు. సానుభూతి పెరుగుతుంది. అయ్యో..వీళ్లు ఈ సమస్య నుంచి ఎలోగోలా బయిటపడితే చాలు అని ప్రార్ధించాలనిపిస్తుంది. ఆ విధమైన ఎమోషన్స్ తో సినిమాని తీర్చిదిద్దాడు.

హాలీవుడ్ స్టాడర్డ్స్ :

ఈ సినిమా కథ లోకల్ దే అయినా స్క్రీన్ ప్లే,మేకింగ్ మాత్రం హాలీవుడ్ సినిమాలను తలపిస్తాయి. ఆ స్దాయిలో దర్శకుడు తీర్చిదిద్దాడు. ఎక్కువగా ఇంట్లో జరిగే కథే అయినా ఆ ఫీల్ రానివ్వడు. ఎమోషన్స్, డ్రామాతో కట్టిపారేస్తాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ చకచకా పరుగెడతాయి. అదే ఆస్కార్ ని ఆకట్టుకుంది. బెస్ట్ ఒరిజనల్ స్క్రీన్ అవార్డ్ తెచ్చిపెట్టింది.

ఫన్,ఎమోషన్ :


ఈ సినిమాని సీరియస్ కంటెంట్ ఉన్నా, దాన్ని చాలా భాగం ఫన్ గా నడిపారు. అలాగే భావోద్వేగాల‌కు పట్టం కట్టారు. దాంతో ఎమోషన్స్ కు భాష లేద‌న్న విష‌యాన్ని ఈ సినిమా రుజువు చేస్తూ ఆస్కార్ పంట పండించింది.